![]() |
![]() |
.webp)
మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షో ప్రతీ రోజూ ఫుల్ ఫంనీగా ఉంటోంది. ఇక రీసెంట్ షోలో లవ్ గురు ఒక టాస్క్ ఇచ్చాడు. లవ్ మాన్షన్ లో ఉన్న జంటల్లో ఏ జంటకి ఎనర్జీ తగ్గుతోంది ఆ ఎనర్జీ పర్సెంటేజ్ ని ఆ బాక్స్ లోంచి తీసేయాలని అని. అలాగే సోనియా - సిద్ధుని పిలిచారు.వాళ్ళు నూకరాజు - ఆసియ నేమ్ బ్లాక్ లోంచి 100 % అనే బ్యాటరీ బ్లాక్ ని తీసేసి అసలు ఎందుకు తీసేసారో చెప్పారు. "ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్, కంపాటిబిలిటీ పరంగా ఇద్దరికీ సరిగా పొసగట్లేదని ఆమెకు నీ అవసరం ఉన్నప్పుడు నీ అగ్రేషన్ కోపం వల్లన ఆమె నీతో ఎక్కువగా ఉండడం లేదు . అలాగే ప్రతీ సారి ఎడ్డిది ఏమీ రాదు అంటూ ఆమె గురించి మాట్లాడుతూ ఉంటావ్. చిన్న చిన్న విషయాలకు కూడా నువ్వు ఆసియా మీద అరుస్తూనే ఉంటావ్ . అంత అవసరం లేదు అనుకుంటా.
ఆసియ నిన్ను చూస్తే భయపడేలా ఉంటోంది. " లాంటి పాయింట్స్ చెప్పింది. దాంతో ఇక నూకరాజు గట్టిగ ఏసుకున్నాడు. ఆమె ఎమోషనల్ గా వీక్ ప్రతీ దానికి ఏడుస్తుంది. నాకు కోపం వస్తుంది నేను ఇంతే ఇక్కడ ఎలా ఉన్నాయో బయట అలాగే ఉంటా. అమ్మా ఆసియా నువ్వు తుమ్మినా, దగ్గినా, మీ వాళ్ళు గుర్తొచ్చినా నాదే తప్పు " అంటూ ఫుల్ రైజ్ అయ్యేసరికి "నువ్వు అరవకు నెమ్మదిగా మాట్లాడు" అంటూ సిద్దు సోనియా కూడా ఫుల్ రైజ్ అయ్యారు. "నా వాయిస్ అంతే" అంటూ నూకరాజు అనేసరికి "నీ వాయిస్ అంతే అంటే ఇక్కడ దొబ్బదు"అంటూ సిద్దు ఫుల్ సీరియస్ అయ్యాడు.
"మాన్షన్ లో నవ్వించేటప్పుడు ఇలాగే మాట్లాడతావా . ఇదే అగ్రేషన్, ఇదే కోపం నువ్వు ఆసియ మీద చూపిస్తున్నావు. అది అందరికీ కనిపిస్తోంది. నువ్వు బయట బూతులు మాట్లాడాతావా మరి ఇక్కడ ఎందుకు మాట్లాడ్డం లేదు" అని సిద్దు అడిగేసరికి నేను బూతులు మాట్లాడతా అంటూ నూకరాజు మండిపడ్డాడు. "కోపం వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవాలి " అంటూ సోనియా చెప్పింది. "కెమెరా ముందు యాక్టింగ్ లు తొక్క తోటకూర " అంటూ సిద్దు గట్టిగ అరిచాడు
![]() |
![]() |